CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. గురవారం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆ పార్టీ పెద్దలతో రాష్ట్ర పార్టీ అంశాలతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌లో చేపట్టిన హైడ్రా చర్యలపైనా ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో చర్చించనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి దీంతో కలిపి 25వ సారి ఢిల్లీకి వెళ్లినట్టవుతుందని ప్రతిపక్ష నేతలు విమర్శించడం గమనార్హం. కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంపైనా ఆయన చర్చించి ఫైనల్ చేయించే అవకాశం ఉన్నది. జాబితాతోనే రానున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

