Lagacharla

Formula e car Race: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా? ఆ కేసులో ఏ1 ఆయనే!

Formula e car Race: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ-కార్‌ రేసులో ACB కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను A1గా ఏసీబీ చేర్చింది.  A2గా అరవింద్‌కుమార్‌ 

A3గా ప్రైవేట్‌ కంపెనీ సీఈవో BLN రెడ్డిలను పేర్కొంది ఏసీబీ. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్‌ కింద కేసు ఫైల్ చేసిన ఏసీబీ 

మరో రెండు కేసులను 409, 120B కింద బుక్ చేసింది. వీటిలో 4 సెక్షన్లు నాన్‌బెయిలబుల్‌ కిందికి వస్తాయి. 

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్ ఈవెంట్‌కు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వహణ, అమలుతో సంబంధం ఉన్న అవినీతి కి  సంబంధించిన ఆరోపణలను అనుసరించి ACB కేసు నమోదు చేసింది. 

కేటీఆర్ పై నమోదైన కేసులు ఇవే

13(1)A PC చట్టం: క్రిమినల్ చర్యల ఉద్దేశపూర్వక కమిషన్.

13 (2) PC చట్టం కింద కేసులు – ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే వర్తించే సెక్షన్.

— సెక్షన్ 409 కింద కేసు — నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదు

— 120B కింద కేసు కూడా నమోదు చేయబడింది — ఒప్పందంలో కుట్ర

ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కేసు  పూర్వాపరాలు ఇలా.. 

ఆర్బీఐ అనుమతి లేకుండా.. ఆర్బీఐ గైడ్లైన్స్ కు వ్యతిరేకంగా భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్టు ఎఫ్ఈఓ ఆరోపించింది. ఈ ఆరోపణలపై ఏసీబీ విచారణ చేపట్టింది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతించారు. దీంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. 

ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు పేమెంట్స్ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలను జరిమాణగా చెల్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ఈ జరిమానా చెల్లించింది. ఆర్బీఐ జరిమానాతో ఈ స్కామ్ బయటకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ చెల్లింపుల విషయంలో రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు తమ సొంత నిర్ణయంతో విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించేశారు. ఏసీబీ మంత్రివర్గం ఆమోదం లేకుండానే పేమెంట్స్ కోసం ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొంది. 

విచారణలో  ఆర్థిక శాఖ కార్యదర్శి అనుమతి లేకుండానే నిధులు విడుదల చేసినట్లు తేలినట్టు చెప్పింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిగాయని ఏసీబీ పేర్కొంది.

కాగా, కేటీఆర్ పై నమోదైన కేసుపై మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో స్పందించారు. ఫార్ములా రేసు పై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకు ఈ ఫార్ములా రేస్‌ను నిర్వహించారని, పేమెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కేందుకు తెగబడుతున్నారని హరీశ్ రావు ఆరోపణలు గుప్పించారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *