Squirrels Hunting Voles: ఉడతలు అంటే సాధు జీవులు అనుకుంటున్నారా? కాదు వైల్డ్ అయిపోయాయంటున్నారు పరిశోధకులు. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ పరిశోధకులు ఉడుతలు సంబంధించి ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో ఉడుతల ఆహార విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపించిందని ఈరోజు (అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 18)ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఈ తాజా స్టడీ “గ్రౌండ్ స్క్విరెల్స్‌పై మన అవగాహనను ప్రాథమికంగా మారుస్తుంది” అని పరిశోధకులు అంటున్నారు.
Squirrels Hunting Voles: ఈ స్టడీ ప్రధాన రచయితా జెన్నిఫర్ ఇ. స్మిత్ ఉడుతల ఆహార విధానాల్లో ఈ మార్పు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. కాంట్రా కోస్టా కౌంటీలోని బ్రియోన్స్ రీజినల్ పార్క్‌లోని పరిశోధకులు జూన్ నుండి జూలై వరకు చేసిన పరిశీలనల ఆధారంగా ఈ స్టడీ రిపోర్ట్ వచ్చింది. అక్కడ, 42% జాతుల ఉడుతలు చురుకుగా వోల్స్‌ను(ఒకరకమైన ఎలుకలు) వేటాడడాన్ని గమనించినట్లు పరిశోధకులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Formula e car Race: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా? ఆ కేసులో ఏ1 ఆయనే!
Squirrels Hunting Voles: యుసి డేవిస్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ పాలసీ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో వైల్డ్, “ఒక ఉడుత వోల్స్ ను వేటాడడం చూసి నా కళ్లను నేను నమ్మలేకపోయాను” అని ఒక ప్రకటనలో తెలిపారు. “అప్పటి నుండి, మేము దాదాపు ప్రతిరోజూ ఆ ప్రవర్తనను చూశాము. మేము చూడటం ప్రారంభించిన తర్వాత, చాలా చోట్ల ఇలా ఉడుతలు వేటాడటాన్ని చూశాము.” అని ఆయన వివరించారు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
పరిశోధకులు యూట్యూబ్‌లో ఉడుతలు వోల్స్‌ను వేటాడినట్లు(Squirrels Hunting Voles) స్పష్టంగా చూపించే వీడియోను ప్రచురించారు. అయితే, శాస్త్రవేత్తలు ఉడుతలు మారే ఇతర జంతువులను వేటాడడం చూడలేదు.
Squirrels Hunting Voles: తమ పరిశోధనల్లో పార్క్ వద్ద ఉన్న ఉడుతల్లో మాంసాహార కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. UC డేవిస్, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-యూ క్లైర్ నేతృత్వంలోని ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఎథాలజీలో ప్రచురించారు.
ఈ వీడియోలో ఎలుకను వేటాడుతున్న ఉడుతను చూడొచ్చు . .