Diabetes symptoms: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు.
మధుమేహం బారిన పడిన వారు జాగత్తపడకపోతే క్రమంగా ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీకు ప్రీ-డయాబెటిక్ ఉంటే గనక మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి మధుమేహ ప్రారంభ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్‌లో శరీరం చక్కెరను (గ్లూకోజ్) సరిగ్గా ఉపయోగించుకోదు. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా నియంత్రించవచ్చు.
మధుమేహం యొక్క లక్షణాలు:
తరచుగా దాహం వేయడం: డయాబెటిస్ ప్రారంభంలో శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. దీని కారణంగా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.
తరచుగా మూత్రవిసర్జన: శరీరం నుండి అదనపు చక్కెరను తొలగించడానికి తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది.
విపరీతమైన ఆకలి: శరీరం శక్తిని అందించడానికి చక్కెరను ఉపయోగించలేకపోతుంది. ఫలితంగా ఎక్కువగా ఆకలిగా ఉంటుంది.
ఆకస్మిక బరువు తగ్గడం: ఆకలిగా అనిపించినప్పటికీ బరువు తగ్గడం మధుమేహానికి సంకేతం.
అలసట: శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల అలసటగా అనిపిస్తుంది.
అస్పష్టమైన దృష్టి: కంటి సమస్యలు కూడా మధుమేహం యొక్క లక్షణం కావచ్చు.
గాయాలు మానడం: చిన్న చిన్న గాయాలు ఆలస్యంగా మానడం కూడా మధుమేహానికి సంకేతం.
తిమ్మిరి లేదా జలదరింపు: తరుచుగా చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపుగా అనిపిస్తుంది.
మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
మధుమేహాన్ని నివారించే మార్గాలు:
మధుమేహాన్ని పూర్తిగా నివారించలేము. కానీ దాని ప్రమాదాన్ని కొన్ని మార్గాల్లో తగ్గించవచ్చు:
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో సహా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. చక్కెర, సంతృప్త కొవ్వును నివారించండి.
రెగ్యులర్ వ్యాయామం: ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ తప్పనసరి.
ఆరోగ్యకరమైన బరువు: అధిక బరువు లేదా ఊబకాయం మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకం.
రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచండి: అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.
ఒత్తిడి నిర్వహణ: ఒత్తిడి మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఒత్తిడి వీలౌనంత వరకు తగ్గించుకోండి.
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు: క్రమం తప్పకుండా డాక్టర్‌ని కలవండి. మీ బ్లడ్ షుగర్‌ని చెక్ చేస్తూ ఉండండి.