Shubman Gill: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఐసీసీ అవార్డుల రేసులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా జూలై నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో గిల్ ఒక కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించాడు.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అత్యధికంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి, అందులో ఒక డబుల్ సెంచరీ (269) కూడా ఉంది. ఈ ప్రదర్శనతో అతను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం గిల్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌తో పోటీపడుతున్నాడు.
ఇది కూడా చదవండి: Vice President Election: సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి పదవికి పోలింగ్
గిల్ ఇప్పటికే మూడు సార్లు (జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025) ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ అవార్డును అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ అవార్డు విజేతను ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు అభిమానుల ఓట్ల ద్వారా ఎంపిక చేస్తారు.