Makhana Health Benefits: మఖానా.. ఇప్పుడు సూపర్ స్నాక్ గా మారిపోయింది. పాప్ కార్న్ మఖానాను ఇష్టంగా తింటున్నారు జనాలు. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో మఖానా బాగా పనిచేస్తోంది. ఇటీవల దాన్ని డిమాండ్ తో పాటు ధర కూడా పెరిగింది. ఆరోగ్యానికి మంచిది కావడంతో పోషకాహార నిపుణులు దీనిని ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు. ఈ క్రమంలో మఖానా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెరువులు, నీటి కుంటల్లో అందంగా విరిసే తామర పూల నుంచే వస్తాయి మఖానా. అయితే అన్ని రకాల తామర పూల విత్తనాల నుంచీ కాదు. ఫూల్ మఖానా తయారయ్యేది మాత్రం యూర్‌యల్ ఫారెక్స్, ప్రిక్లీ అనే వాటర్ లిల్లీ నుంచే. ఎక్కువగా ఆసియాలో కనిపించే ఈ రకం వాటర్ లిల్లీ పువ్వులు..ఊదా రంగులో చిన్నగా ఉంటే, ఆకులేమో పెద్ద పెద్దగా మూడు అడుగులంత పరిమాణంలో ఉంటాయి.
Makhana Health Benefits: ఇక విత్తనాల విషయానికి వస్తే అందంగా పూసిన తామరపూల తొడిమ దగ్గర ఈ మఖానా విత్తనాలు ఉంటాయి. పూల రెక్కలు మొత్తం రాలిపోయాక ఆ గింజలన్నీ ఎండిపోయి నీటి అడుగుకి చేరతాయి. ఈ విత్తనాల్ని వలలూ, బుట్టలతో సేకరిస్తుంటారు. ఆ తర్వాత మట్టీ, ఇతర చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా చేసిన నల్లని గింజల్ని ఇనుప మూకుళ్లలో సన్నని సెగ మీద వేయిస్తారు. ఆ తర్వాత గింజల్ని పగలగొడితే పాప్‌కార్న్‌లా పేలుతూ బయటకు వస్తాయీ ఫూల్‌మఖానా.
ఇటీవల బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మఖానాలో ఔషధ గుణాలున్నట్లు తేల్చారు. మఖానాలో మీథేన్ సల్ఫోనామైడ్ అనే ప్రత్యేకమైన సమ్మేళనాన్ని గుర్తించారు. మఖానాలో బయోయాక్టివ్ సమ్మేళనం సహజంగా సంభవించే అంశంగా గుర్తించబడటం ఇదే ఫస్ట్ టైమ్ అని BAU వీసీ డా. డి.ఆర్ సింగ్ అన్నారు. అయోడోబెంజీన్ యొక్క సల్ఫోనామైడ్ సమ్మేళనం దాని ఔషధ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తమ పరిశోధన మఖానాకు ప్రపంచ గుర్తింపు తేవడంతో పాటు మార్కెట్ విలువను పెంచుతుందని డీఆర్ సింగ్ తెలిపారు.
Makhana Health Benefits: తమ పరిశోథన మఖానా పరిశ్రమ, ప్రపంచ చిరుతిళ్ల పరిశ్రమ రెండింటినీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన శాస్త్రీయ సమాజానికి, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానం చేసేందుకు, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ఈ పరిశోధన స్ఫూర్తినిస్తుందన్నారు. మఖానాను న్యూట్రాస్యూటికల్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా మార్చగలదని చెప్పారు.
మఖానా ఉపయోగాలు:
మఖానాలో క్యాలరీలు తక్కువగా ుంటాయి. దీంట్లో ఉన్న ప్రొటీన్లూ, పీచూ పదార్ధాలు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ నట్స్‌లో ఉండే అధిక పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలావరకు తగ్గుతాయి.
దీంట్లో అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌నీ, ట్రైగ్లిజరైడ్స్‌నీ అదుపులో ఉంచుతుంది. మఖానా తింటే ఎముకలూ, దంతాలూ దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులున్నవారు రోజూ తీసుకుంటే ఎంతో మంచిది. దీంట్లో ఉండే బి- విటమిన్ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.