200cc Bikes: మీ దగ్గర రూ. 2 లక్షలు ఉంటే చాలు మీరు మంచి మైలేజ్ ఫ్రెండ్లీ బైక్ కొనొచ్చు. TVS Apache RTR 200 4V, బజాజ్ పల్సర్ NS200, హోండా హార్నెట్ 2.0, బజాజ్ పల్సర్ 220F బైక్ లు మంచి లుక్ కలిగి ఉండటమే కాదు. మైలేజ్ కూడా ఇస్తాయి.
మంచి లుక్, మైలేజ్ ఇచ్చే బైక్ నడపడానికి ఎవరు ఇష్టపడరు. చెప్పండి. 350cc-400ccలో బైక్‌ల ధర రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా వీటి మైలేజీ కూడా తక్కువగా ఉంటుంది. మీ బడ్జెట్ రూ. 2 లక్షల వరకు ఉంటే.. మాత్రం మీరు ఆందోళన అవసరం లేదు. మార్కెట్లో అనేక 200cc సెగ్మెంట్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫుల్ మైలేజీని అందిస్తాయి.
1. TVS Apache RTR 200 4V:
TVS నుండి వచ్చిన మరో గొప్ప బైక్ TVS Apache RTR 200 4V . ఇది గొప్ప ఫీచర్లు , మంచి మైలేజీతో వస్తోంది. ఇది 197.75 cc సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 41.9 kmpl (ARAI), . ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ABS, రెండు రైడింగ్ మోడ్‌లు, 12-లీటర్ ఆయిల్ ట్యాంక్ , 152 కిలోల బరువును కలిగి ఉంటుంది. దీని స్పోర్టీ లుక్స్ అధిరిపోతుంది. ముఖ్యంగా పవర్ , మైలేజ్ కోరుకునే రైడర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
Also Read: google pay: గూగుల్ పే వాడుతున్నారా ? జాగ్రత్త
2. బజాజ్ పల్సర్ NS200:
బజాజ్ నుండి వచ్చిన పల్సర్ NS200 బైక్ మంచి ఇంజిన్ , అద్భుతమైన లుక్ కలిగి ఉంటుంది. ఇది 199.5 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ 24.13 బిహెచ్‌పి పవర్ , 18.74 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 38 kmpl,. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అంతే కాకుండా సింగిల్, డ్యూయల్-ఛానల్ ABS ను కలిగి ఉంటుంది. 159.5 కిలోల బరువుతో, దీని స్పోర్టీ డిజైన్ , దూకుడు లుక్ యువతను బాగా ఆకట్టు కుంటుంది. ఇది గొప్ప స్పోర్ట్స్ బైక్‌గా నిలుస్తోంది.