Pawan Kalyan

Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ కలిసి రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని పవన్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆయన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!
TG High Court

TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!

TG High Court: హైదరాబాద్‌ పరిధిలోని రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!
Adulterated Paneer

Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!

Adulterated Paneer: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా 45 ఫుడ్ ఔట్‌లెట్లు, 8 పనీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి 825 కిలోల కల్తీ పనీర్, నకిలీ చీజ్ సీజ్ చేశారు. సింథటిక్ పాలు, గంజిపొడి, జంతువుల కొవ్వుతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేని నిందితులపై కేసులు నమోదు కాగా, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.

మరింత Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!
Harish Rao

Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుతం జనాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు, పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందన్న బీఆర్ఎస్ వినతిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించిందని, ప్రభావిత ప్రాంతాలకు రక్షణ చర్యలు లేదా ఆర్‌అండ్‌ఆర్ కింద నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిందని హరీష్ రావు వెల్లడించారు.

మరింత Harish Rao: కాంగ్రెస్ మార్క్ మోసం ప్రజలకు అర్థమైంది..!
Revanth Reddy:

Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!

Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తూ.. కులాల వారీగా హాస్టళ్ల కంటే అందరూ కలిసి చదివే టీపీఎస్ విధానమే సరైందని పేర్కొన్నారు. 1800 మందితో ఆరుట్ల స్కూల్ ‘నో వేకెన్సీ’ స్థాయికి చేరిందని, 2034 నాటికి ఇక్కడి పిల్లలు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఉప్పల్ స్టేడియం టెండర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు.

మరింత Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!
Pawan Kalyan

Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చారు. సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా బాబు పరిస్థితి తెలుసుకున్న పవన్.. నిరంజన్ ఇంట 45 నిమిషాలు గడిపి, ధైర్యం చెప్పారు. పవన్ రాకతో ఆ బాలుడి చివరి కోరిక నెరవేరింది.

మరింత Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
Telangana Public School: 

Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!

Telangana Public School: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. రూ.15 కోట్ల ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాసేపట్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మరింత Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!
Kishan Reddy 

Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!

Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చిందని చెప్తూ.. మెట్రోపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. తాము రేవంత్‌కు కాకుండా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల IRFC లోన్ పెండింగ్‌కు పలు కారణాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

మరింత Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!
ACB Raids

ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!

ACB Raids: హైదరాబాద్‌లో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఛత్రినాకలోని ఆయన ఇల్లు, కార్యాలయం సహా 10 ప్రాంతాల్లో ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 10 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!
TG Public School

TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

TG Public School: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్ధమైంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, కార్పొరేట్ ప్రమాణాలతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు నిర్మించిన ఈ మోడల్ స్కూల్‌ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లు, క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న సీఎం.. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మరింత TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!