Sushanth: అక్కినేని నాగార్జున మేనల్లుడు, నటుడు సుశాంత్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 38 సంవత్సరాలు వచ్చిన సుశాంత్ ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ అప్పటి నుండీ గ్రాండ్ విక్టరీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ‘కరెంట్, చి.లా.సౌ.’ వంటి సినిమాలు గౌరవ ప్రదమైన విజయాన్ని సాధించాయి. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కీలక పాత్ర పోషించి, మరింత మందికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను సోలో హీరోగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటించాడు. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లోనూ నటించిన మీనాక్షి చౌదరి తాజాగా విడుదలైన ‘లక్కీ భాస్కర్’లో హీరోయిన్ గా చేసింది. అలానే ‘మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాలలో నటిస్తోంది. తమిళ చిత్రసీమలోకీ అడుగుపెట్టిన మీనాక్షి చౌదరితోనే సుశాంత్ త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
