Anirudh Suswaram: ఇండియన్ ఐడల్ తాజా సీజన్ ఫైనల్ విజేతలు ఎవరో తేలింది. మొత్తం 15 మందిలో మన తెలుగు అబ్బాయి అనిరుధ్ చోటు సంపాదించుకోవడం విశేషం. గతంలో ఈ షోలో శ్రీరామచంద్ర, రేవంత్ విన్నర్స్ గా నిలువగా కారుణ్య రన్నరప్ గా నిలిచారు. ఇప్పుడు కర్నూల్ కి చెందిన అనిరుధ్ తాజాగా ప్రకటించిన టాప్ 15 లిస్ట్ లో చోటు సంపాదించారు. ఐఐటి మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న అనిరుధ్ ఇంటిపేరు సుస్వరం. ఐదేళ్ళ వయసు నుంచే కర్ణాటక మ్యూజిక్ ను నేర్చుకున్న అనిరుధ్ ఆ తర్వాత రామాచారి వద్ద లైట్ మ్యూజిక్, ఓంకార్ హవల్దార్ వద్దద హిందూస్థానిలో శిక్షణ పొందాడు. సంగీతం పట్ల అభిరుచే పలు బహుమతులు తెచ్చిపెట్టింది. అంతే కాదు టాప్ మ్యూజిక్ డైరక్టర్స్ వద్ద పని చేసే అవకాశం కల్పించింది. ‘ఎ1 ఎక్స్ ప్రెస్’లో ‘తెలవారుతుంటే..’, ‘చావు కబురు చల్లగా’లో ‘ఓరోరి దేవుడో…’, ‘జయమ్మ పంచాయితీ’లో ‘బాగుంది కదా…’, ‘జన2023’లోనూ, ‘శాసన సభ’లో రెండు పాటలు పాడాడు అనిరుధ్. ఇప్పడు ఇండియన్ ఐడల్ తాజా సీజన్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే టాప్ 15లో చోటు సంపాదించిన అనిరుధ్ తన టాలెంట్ తో విన్నర్ గా నిలిస్తే సింగర్ గా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది. మరి మన తెలుగు కుర్రాడు టైటిల్ తో రావాలని ఆశిద్దాం…