Retro Trailer: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రెట్రో’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న ఈ మూవీ, మాస్ యాక్షన్‌తో పాటు ప్రేమ, హాస్యం, డ్రామాతో సరికొత్త అనుభవాన్ని అందించనుంది. తాజాగా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ సూర్య ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. సూర్య డ్యాషింగ్ లుక్స్, యాక్షన్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రం, సాంప్రదాయ కథనాన్ని సరికొత్త శైలిలో ప్రెజెంట్ చేయనుందని ట్రైలర్ సూచిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, జోజు జార్జ్, జయరాం, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణ.
ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా, మే 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందని అంచనా. సూర్య-కార్తీక్ కాంబో నుంచి మరో బ్లాక్‌బస్టర్ రాబోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.