Venky Atluri

Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్!

Venky Atluri: భారత ఆటోమొబైల్ చరిత్రలో మారుతి కార్ల అద్భుత జర్నీని తెరపై చూపించేందుకు దర్శకుడు వెంకీ అట్లూరి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ‘796 CC’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. మారుతి కార్ ఇంజిన్ సామర్ధ్యాన్ని సూచించే ఈ టైటిల్ సినిమా కథకు పర్ఫెక్ట్ ఫిట్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా సూర్య నటిస్తుండగా, అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు టాక్. ఈ ఫ్రెష్ జోడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుందని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. కీర్తి సురేష్ నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా అనేది త్వరలో స్పష్టత రానుంది. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషనల్ డ్రామాతో పాటు మారుతి బ్రాండ్ స్ఫూర్తిని తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: అల్లు అర్జున్ ఆర్మీకి షాకింగ్ న్యూస్.. ఆగిపోయిన త్రివిక్రమ్ సినిమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *