Supreme Court

Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..

Supreme Court: భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) పోస్టుల నియామకాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి పద్ధతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిష్పత్తి ప్రకారం పురుషులకు 6 సీట్లు, మహిళలకు 3 సీట్లు కేటాయిస్తారు. ఈ విధానం తప్పు అని, ఇకపై ఇలా అమలు చేయకూడదని తేల్చిచెప్పింది.

సుప్రీంకోర్టు స్పష్టం చేసింది – లింగ తటస్థత అంటే స్త్రీ, పురుష భేదం లేకుండా అత్యంత ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేయడం. మహిళలకు సీట్లు పరిమితం చేసి, ఖాళీ పోస్టులను పురుషులకు రిజర్వ్ చేయడం సమానత్వ హక్కును ఉల్లంఘించడం అవుతుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: West Indies vs Pakistan: పాకిస్తాన్‌కు బిగ్ షాక్… 5 వికెట్ల తేడాతో విండీస్ విక్టరీ

ఈ కేసు అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే ఇద్దరు మహిళా అధికారుల పిటిషన్ ఆధారంగా వచ్చింది. వీరు జరిగిన పరీక్షల్లో వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినా, మహిళల కోటాలో ఖాళీలు లేవని కారణం చూపి వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాజా తీర్పులో ధర్మాసనం ఆర్మీ ఉన్నతాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఇలాంటి పద్ధతులు కొనసాగితే దేశ భద్రతకే ముప్పు” అని హెచ్చరించింది. ఇకపై సమానత్వ పద్ధతిలోనే నియామకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ఎంపిక ప్రక్రియలో పురుష, మహిళా అభ్యర్థుల మెరిట్ జాబితాను బహిర్గతం చేయాలి అని సూచించింది.

సుప్రీంకోర్టు స్పష్టం చేసింది – ఇది సైన్యంపై తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దడం కాదు, రాజ్యాంగం మరియు చట్టం చెప్పిన మార్గాన్ని అమలు చేయడమే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  S. Jaishankar: యూఎస్ లో ట్రంప్ విజయంపై భారత్ కు ఆందోళన లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *