Supreme Court

Supreme Court: మసీదులో జైశ్రీరామ్ నినాదాలు.. సుప్రీంకోర్టు ఏమందంటే..

Supreme Court: మసీదులో ‘జై శ్రీరామ్‘ నినాదాలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం ఎలా అవుతుంది?’ అని కోర్టు ప్రశ్నించింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ 13న ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

దీనిపై జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ సంజీవ్‌ మెహతాతో కూడిన ధర్మాసనం.. ఇద్దరు వ్యక్తులు మతపరమైన నినాదాలు చేస్తున్నారా లేక ఒక వ్యక్తి పేరు చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఈ నేరం ఎలా గుర్తిస్తారు అని అడిగింది. 

ఈ కేసు  దక్షిణ కర్ణాటక జిల్లా కడబ పోలీస్ స్టేషన్‌కు చెందినది. పిటిషనర్ హైదర్ అలీ 2023 సెప్టెంబర్ 25న కీర్తన్ కుమార్, సచిన్ కుమార్‌లపై ఐత్తూరు గ్రామంలోని బదురియా జుమ్మా మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Coffee: కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందా..? షాకింగ్ సర్వే..

Supreme Court: ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు 295A – మతపరమైన మనోభావాలను ఉల్లంఘించడం, 447 – అతిక్రమం 505 – 506 నేరపూరిత బెదిరింపు కింద కేసు నమోదు చేశారు.

ఈ సెక్షన్లపై విచారణ కొనసాగించేందుకు పుత్తూరు స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. ఉపశమనం కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13న, హైకోర్టు దానిని నేరంగా పరిగణించకుండా, మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలుగా నిర్ధారించి..  ఇద్దరిపై నమోదు చేసిన కేసును ముగించింది. తరువాత పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు కూడా కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *