Sukumar: మన డైరెక్టర్లకు నేషనల్ లెవల్లో సూపర్ క్రేజ్ వచ్చింది. భారీ రేంజిలో డిమాండ్ ఏర్పడుతోంది. మన తెలుగు డైరెక్టర్ల ట్యాలెంట్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది. బాహుబలితో రాజమౌళి తరువాత.. పుష్ప సిరీస్ తో సుకుమార్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూలు చేయడంతో సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఓ అతిపెద్ద ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే మణిరత్నం, అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్లతో షారుఖ్ ఖాన్ వర్క్ చేశాడు.మరోసారి సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. అందుకే సుకుమార్ తో వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వినడానికే తప్ప నిజం అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.
