TVK Maanadu: తమిళ సినీ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రెండవ మహానాడు విషాదకరంగా మారింది. గురువారం (ఆగస్టు 21) మధురైలో జరిగిన ఈ భారీ సభకు అభిమానులు, కార్యకర్తలు అపారంగా తరలివచ్చారు. అంచనాలకు మించి వచ్చిన జనసందోహం కారణంగా సభ ప్రాంగణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరైనట్లు అంచనా. అయితే అకస్మాత్తుగా ఏర్పడిన తోపులాటతో అనేక మంది కుప్పకూలిపోయారు. ఈ తొక్కిసలాటలో 400 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో ఒకరు మృతి చెందగా, కనీసం 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: TVK President Actor Vijay: మహిళల భద్రత కేకలు స్టాలిన్ అంకుల్ వినలేదా?
ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, సభలో ఏర్పాట్లు తగిన విధంగా లేవని, పెద్దఎత్తున జనాలు ఒకేసారి వేదికకు చేరడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్నారు.
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అభిమానులు, కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా విషాదంలో మునిగిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు అంటున్నాయి.