Srisailam dam: శ్రీశైలం డ్యాం భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉన్నది. డ్యాం దిగువన పంజ్ఫూల్లో భారీ గొయ్యి ఏర్పడటంతో ఆనకట్ట భవిష్యత్తు డేంజర్లో పడిందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలోనే ప్లంజ్ ఫూల్లో ఏర్పడిన గొయ్యి ఏర్పడింది. అది ఇప్పుడు పెద్దగా మారడంతో పెను ప్రమాదం పొంచి ఉన్నది.
Srisailam dam: ఇటీవలే నిపుణుల కమిటీ డ్యాం దిగువన అంతర్భాగంలో పరిశీలించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉన్నదని తేలింది. డ్యాం నుంచి దిగువకు విడుదలయ్యే నీటి ప్రవాహ వేగానికి ప్లంజ్ ఫూల్లో 35 నుంచి 45 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడినట్టు కమిటీ నివేదికలో పేర్కొన్నది.
Srisailam dam: డ్యాం కాంక్రీట్ పునాదికి 15 మీటర్ల దూరంలో మొదలైన ఈ గొయ్యి.. సుమారు 150 మీటర్ల వరకు విస్తరించిందని నిపుణుల కమిటీ తన నివేదకలో పేర్కొన్నది. దీనివల్లే డ్యాం అప్రాన్కు తీవ్ర ముప్పు వాటిల్లిందని నిఫుణులు హెచ్చరించారు. అప్రాన్ కింద 4 మీటర్ల లోతైన రంధ్రం ఏర్పడి, డ్యాం వైపునకు 14-15 మీటర్ల వరకు విస్తరించి ఉన్నది. దీంతో అప్రాన్లోని సగభాగం వేరే ఆధారం లేకుండానే వేలాడుతున్నట్టుగా ఉన్నదని తెలిపారు.

