Srisilam Dam: కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం ఇంకా కొనసాగుతున్నది. మునుపెన్నడూ లేనంతగా ఈ సారి వరదనీరు కిందికి ప్రవహిస్తున్నది. ఇప్పటికే 885 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు ఎప్పుడో చేరింది. ఈ ఏడాదే ఇప్పటి వరకు ఆరుసార్లు డ్యామ్ గేట్ల ద్వారా వరదనీటిని కిందికి విడుదల చేశారు. గురువారం మూడు క్రస్ట్ గేట్ల తెరిచి 84 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
Srisilam Dam: శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ద్వారా 67,773 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వరదనీటి ప్రవాహం కారణంగా కృష్ణా నదిపైనే ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం జలాశయానికి 1,96,177 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతున్నది.