Crime News

Crime News: ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!

Crime News: ఇలా తయారు అయ్యారు ఏంటి . కట్టుకున్న వాడి కంటే …కట్టుకున్న వాడు వచ్చిన తర్వాత ..వచ్చిన ప్రియుడు ఎక్కువైపోయారు. ప్రియుడి మాటలు తేనే పూసిన కలకండలా ఉన్నాయో..కక్కుతున్న మొగుడి మాటలు ..కాల్చుకు తినే కట్టేలా ఉన్నాయో ..ఏమో కానీ మొత్తానికి చంపేస్తున్నారు. మూడు ముళ్ళు వేసిన మొగుళ్లను పాతిపెట్టేస్తున్నారు. ఎందుకు ? ఎదో ఒకటి రెదను కాదు..ఈ మధ్య కాలంలో ఇవే ఎక్కడో ఒక చోట …

శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి పేట గ్రామంలో ఇటీవల దారుణమైన హత్య జరిగింది. గురుగుబెల్లి చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాజాగా ఈ మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి

అయితే ఈ కేసుపై పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడి భార్య ఈశ్వరమ్మే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. పలువురితో కలిసి ఈశ్వరమ్మ ప్రియుడు బాలమురళీ కృష్ణ.. చంద్రయ్యను హతమార్చినట్లు సమాచారం.

చంద్రయ్య హత్య కోసం దాదాపు 20 రోజులు రెక్కీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా చంద్రయ్య హత్యకు ఏడాది క్రితమే ప్లాన్ చేశారని సమాచారం. గతంలో కూడా చంద్రయ్యను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందులో చంద్రయ్య భార్య ఈశ్వరమ్మే కీలక పాత్రగా.. చంద్రయ్య కదలికలను ఎప్పటికప్పుడు.. ప్రియుడు బాలమురళీకృష్ణకు తెలియజేస్తూ ఉండేదని తెలిసింది. ఇక చంద్రయ్య హత్య కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం.

చంద్రయ్య కూతురు శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే సాయంత్రం కాలేజీ నుంచి వస్తుండగా.. ఆమదాలవలసలో బస్సు దిగి తండ్రికి ఫోన్ చేసింది. దీంతో సాయంత్రం 6.30 గంటల సమయంలో చంద్రయ్య తన ఇంటి నుంచి బైక్ పై వెళ్లాడు. అయితే ఎంత సేపటికి తన కూతురు దగ్గరకు వెళ్లలేదు.. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు.

దీంతో భార్య ఈశ్వరమ్మ, బంధువులు చంద్రయ్య కోసం గాలించారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బగ్గోడి చెరువు గట్టు దిగువున ఉన్న పొలంలో అర్ధరాత్రి సమయంలో చంద్రయ్య విగత జీవిగా కనిపించాడు. చంద్రయ్య మృతదేహం తలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే శరీరంపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. ఈ మర్డర్‌పై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Terrorist Pannu: ఉగ్రవాది పన్నూ మరో బెదిరింపు.. ఈసారి విమానాలను లేపేస్తానంటూ.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *