Sri Rama Navami 2025: మహా భక్తి ఛానల్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కాకినాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన కళ్యాణ మహోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూసి పరవశించిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు మహా గ్రూప్ చైర్మన్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ దంపతులు సీతారాములూరి కళ్యాణాన్ని నిర్వహించారు ఉదయం నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు మిరువు రామంగా సాగుతూనే ఉన్నాయి కాకినాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రాములోరి పెళ్లికి తొండోపతండాలుగా వచ్చిన ప్రజలు అక్కడి ఏర్పాట్లు చూసి సీతారాముల కళ్యాణం భద్రాచలంలో ప్రతి ఏటా జరిగినంత వైభవంగా మహాభక్తి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం తమ సుకృతమని వ్యాఖ్యానించారు కళ్యాణ మహోత్సవ ఆద్యంతం వేద పండితులు సంప్రదాయ రీతిలో ప్రతి క్రతువును నిర్వహించి శ్రీరామచంద్రుని వివాహ వేడుక అద్భుతంగా జరిగేలా చేశారు ప్రతి క్రతువును భక్తులకు వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సాగేలా వేద పండితులు తమ పాండిత్యంతో భక్తులను అలరించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన పెద్దలు అందరూ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన మహా గ్రూప్ చైర్మన్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణను అభినందనలతో ముని చెప్పారు కాకినాడ పట్టణంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అద్వితీయంగా నిర్వహించి భక్తులకు అనిర్వచనీయ అనుభూతిని కలిగించారంటూ అందరూ అభినందనలు అందజేశారు కాకినాడలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వీడియోను ఈ క్రింద చూడొచ్చు.