SRH vs DC: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సరి కొత్త రికార్డును సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నిన్న జరిగిన మ్యాచ్ లో పాట్ కమ్మిన్స్ తన మొదటి మూడు ఓవర్లలోని మొదటి బంతుల్లో వికెట్లు పడగొట్టడం ద్వారా రికార్డు సృష్టించాడు. మూడు వేర్వేరు ఓవర్లలోని వేసిన మొదటి బంతులన్నింటికీ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ గా నిలిచాడు.
అంతే కాదు, కెప్టెన్‌గా, ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా గా కమిన్స్ నిలిచాడు. అంతకుముందు, అక్షర్ పటేల్ మొదటి 6 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టాడు. 2008లో ముంబై కెప్టెన్‌గా ఉన్న షాన్ పొల్లాక్ కూడా 2 వికెట్లు తీసి మెరిశాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: Pat Cummins: T20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పాట్ కమ్మిన్స్..
SRH vs DC: తన అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మూడో ఓవర్ మొదట బంతికి ఫాఫ్ డుప్లెసిస్, ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ పోరెల్‌ను కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు.