Mohammed Shami: గాయంతో కోలుకుని ఇటీవలే రంజీ మ్యాచ్ తో పునరాగమనం చేసిన భారత సూపర్ పేసర్ మహ్మద్ షమీ ఆసీస్ కు వెళతాడా? లేదా ? అన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడి మధ్యప్రదేశ్‌పై ఐదు వికెట్లు సాధించి ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. భారత మాజీలు, అభిమానులు షమీని తొందరగా ఆస్ట్రేలియాకు పంపాలని కోరుతున్నా బిసిసిఐ ఇంకా నిర్ణయం ప్రకటించడం లేదు.
ఇది కూడా చదవండి: Mohammed Siraj: పెర్త్ వికెట్లు బుమ్రా చలవే..అతని సలహాతోనే రాణించానంటున్న సిరాజ్
Mohammed Shami: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్తాడా? లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గాయం నుంచి కోలుకున్న షమీ.. భారత జట్టు లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో షమీ గురించి కొత్త అప్‌డేట్ బయటికొచ్చింది. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్‌మెంట్ షమీ ఆసీస్‌కు వెళ్తాడా? లేదా అనేది తేలుస్తారని బయటకు వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఆస్ట్రేలియాకు పంపే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తుందని సమాచారం. ప్రస్తుతం స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్‌మెంట్ వర్గాలతోపాటు నేషనల్ సెలక్టర్ ఒకరు రాజ్‌కోట్‌లో ఉంటూ షమీ బౌలింగ్‌ను దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో అతను సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా? అతడి ఫిట్‌నెస్ ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించి టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేయనున్నారని సమాచారం. స్పోర్ట్స్ సైన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తేనే షమీ ఆసీస్‌కు పయనమవుతాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. ఈ పింక్ బాల్ డే/నైట్ టెస్టు డిసెంబరు 6 నుంచి ప్రారంభం కానుంది.