Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు సమస్త ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర పండితులు కలిసి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు.

Also Read: Viral Video: రైలు ఎక్కుతుండగా పడిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే ?
ఆలయ అధికారులు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల వివరాలు తెలియజేసి, ఈ పర్వదినానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు.
శివభక్తుల కోసం ఈ మహోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

