దసరా సందర్బంగా ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ 5 వేల 304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్), ఎల్‌బి నగర్, ఉప్పల్, సంతోష్ నగర్, కెపిహెచ్‌బి నుంచి ప్రత్యేక RTC బస్సులు బయలుదేరుతాయని టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పండుగ సీజన్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.