ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వితరణ చాటుకున్నారు. ఓ పేదింటి చిన్నారికి వైద్య చికిత్సలు చేయించి మానవత్వం నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని డీ.చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందుప్రియలది నిరుపేద కుటుంబం. వారి మూడేండ్ల చిన్నారి గుండె ఆపరేషన్ గురించి సోనూసూద్ తెలుసుకున్నారు.
వారిని ముంబైకి రప్పించి అక్కడి ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించారు. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. బాలికకు చిన్ననాటి నుంచే గుండె సమస్య ఉండగా, ఆపరేషన్‌కు రూ.6 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.