Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను గాయపడగా, శుక్రవారం రాత్రి కిష్త్వార్‌లో భద్రతా దళాలతో జరిగిన ప్రత్యేక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ చెలరేగాయి. ఉధంపూర్ జిల్లా డూడు బసంత్‌గఢ్ హైట్స్‌లో భద్రతా దళాలు జైష్-ఎ-మొహమ్మద్ (JeM) కు చెందినట్టు భావిస్తున్న 3-4 మంది ఉగ్రవాదులను గుర్తించాయి. సమాచారం ఆధారంగా ఆర్మీ, SOG, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడు.
జమ్మూ IGP ఒక పోస్ట్‌లో “ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఆర్మీ, పోలీసులు, SOG సంయుక్త బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి” అని తెలిపారు.
కిష్త్వార్‌లోనూ ఉగ్రవాదుల కదలిక
ఇదే సమయంలో, శుక్రవారం రాత్రి కిష్త్వార్ జనరల్ ఏరియాలో కూడా ఉగ్రవాదులు భద్రతా దళాలతో తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. వైట్ నైట్ కార్ప్స్ తెలిపిన వివరాల ప్రకారం, నిఘా ఆధారిత ఆపరేషన్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు 2-3 మంది ఉగ్రవాదులతో సంబంధం ఏర్పరచుకున్నాయి.
ప్రస్తుతం కిష్త్వార్‌లో కూడా కాల్పులు కొనసాగుతున్నాయని, ఆపరేషన్ జరుగుతోందని సైన్యం ధృవీకరించింది.
ఆర్టికల్ అప్డేట్ అవుతుంది..