Singareni: బొగ్గు నుంచి బంగారంలోకి అడుగుపెట్టిన సింగరేణి

Singareni::సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కీలకమైన ఖనిజ రంగంలోకి విస్తరించింది. బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం లైసెన్స్‌ను సొంతం చేసుకున్నట్లు సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ప్రకటించారు.

కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో సింగరేణి 37.75 శాతం రాయల్టీని కోట్ చేసి, ఎల్-1 బిడ్డర్‌గా నిలిచింది.

ఈ విజయాన్ని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సింగరేణిని ఇతర రంగాల్లో విస్తరించే దిశగా సాధించిన తొలి అడుగుగా బలరామ్ అభివర్ణించారు. వచ్చే ఐదేళ్లలో అన్వేషణ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధనలు చేపడతారు. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్రానికి నివేదికగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ గనులను మైనింగ్ కోసం సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా, ఈ గనులను మైనింగ్‌కు దక్కించుకునే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతం మొత్తాన్ని గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించవలసి ఉంటుంది.

బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం సుమారు రూ.90 కోట్లు వ్యయం అవుతుందని అంచనా, అందులో రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: రాజేంద్రనగర్‌లో విషాదం ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *