Siddu Jonnalagadda: ‘డీజే టిల్లు’కు ముందు కూడా సిద్ధు జొన్నలగడ్డ కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అందులో ఒకటి రెండు సినిమాలు హిట్ కూడా అయ్యాయి. అయితే ‘డీజే టిల్లు’ తర్వాత సిద్ధుకు ఓవర్ నైట్ స్టార్ హీరో ఇమేజ్ వచ్చేసింది. దాంతో అందరూ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సిద్ధు నటించిన ‘టిల్లు స్క్వేర్’ హిట్ కావడంతో ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సిద్ధు…. ‘జాక్’ మూవీతో పాటు ‘తెలుసు కదా’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది కాకుండా ఇటీవలే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కోసం ‘కోహినూర్’ మూవీకి సైన్ చేశాడు. ఇదే సమయంలో సిద్ధు జొన్నలగడ్డ నాలుగో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో విజయాలను అందుకున్న దర్శకుడు పరశురామ్ కు లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీస్టార్’ పరాజయాన్ని అందించింది. అయితే.. సిద్ధుని దృష్టిలో పెట్టుకుని పరశురామ్ ఇప్పుడో కథను తయారు చేశాడట. ఈ మూవీని దిల్ రాజ్ బ్యానర్ లో చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
