Siddhu Jonnalagadda: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరోసారి సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో బాక్సాఫీస్ దద్దరిల్లించిన సిద్ధు, జాక్ సినిమాతో నిరాశపరిచాడు. ఇప్పుడు కొత్త సినిమా తెలుసు కదాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లవ్ స్టోరీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? సిద్ధు మళ్లీ బాక్సాఫీస్ షేక్ చేస్తాడా?
Also Read: Adivi Sesh: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. సీజేఐకి లేఖ రాసిన హీరో
సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. కానీ, జాక్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సిద్ధు తన మార్క్ కామెడీ, ఎమోషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా సిద్ధుకు మరో 100 కోట్ల హిట్ ఇవ్వాలని సిద్ధూతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.