Border-Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఆస్ట్రేలియా– భారత్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కు ముందు భారత ఆటగాళ్లు గాయాలపాలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా ప్లేయర్స్ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో ఇండియా ఏతో ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఈ మ్యాచ్ జరుగుతున్నది. జట్లులోని టాప్ బౌలర్లను సీనియర్ బ్యాటర్లు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేక తీవ్రంగా సతమతమవుతున్న స్టార్ బ్యాట్స్ మెన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ గాయపడినట్లు సమాచారం. రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ వేలికి గాయమైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: IND vs SA: సిరీస్ గెలుపు కప్పేసిన సమస్యలు
Border-Gavaskar Trophy: స్లిప్స్‌లో క్యాచ్ పడుతుండగా గాయం అయినట్లు తెలుస్తోంది. ఇక, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ మోచేతికి బంతి బలంగా తాకడంతో గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో బ్యాటింగ్ మధ్యలోనే రాహుల్ మైదానాన్ని వీడినట్లు సమాచారం. దీంతో మొదటి టెస్టుకు వీరిద్దరు అందుబాటులో ఉండేది అనుమానమేనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు, .ఈ మ్యాచ్ లో కోహ్లీతోపాటు పంత్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లలేదు.ఇంకా ఇండియాలోనే ఉన్నారు. అయితే, హిట్ మ్యాన్ భార్య రితికా సజ్దే శుక్రవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రెగ్నెంట్ కారణంగానే రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లలేదని.. ఇప్పడు కొడుకు పుట్టడంతో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.