IND vs SA: సౌతాఫ్రికా పై టీమిండియా రికార్డుల వర్షం కురిపించింది. 3-1తో సిరీస్ విక్టరీ కొట్టింది. మరి టీమిండియాలో అంతా బాగుందా అంటే లేదనే చెబుతున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్ నాటికి అత్యుత్తమ జట్టును రూపొందించాల్సిన తరుణంలో.. సౌతాఫ్రికా టూర్ అనంతరం కూడా టీమిండియాను వేధిస్తున్న మూడు ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
IND vs SA: సఫారీ గడ్డపై అత్యధిక టీ20 స్కోరు నమోదు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు సాధించిన మొదటి పూర్తి సభ్య దేశంగా అవతరించింది సూర్య సేన. నాలుగో టీ20లో రెండో అత్యధిక టీమ్ స్కోరును కూడా అందుకుంది. ఇలా పలు రికార్డులు నెలకొల్పినా టీమిండియా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాబట్టలేక పోయింది. వచ్చే ప్రపంచకప్ కు సంబంధించి టీమ్ ను బిల్డ్ చేసే పని సౌతాఫ్రికా టూర్ అనంతరం కూడా కొలిక్కి రాలేదు. కెప్టెన్ సూర్య కుమార్ తో పాటు టీమ్ మేనేజ్ మెంట్ బ్యాటర్ల విషయంలోనూ..పేస్ బౌలింగ్ రిజర్వ్ ల తయారీలోనూ ప్రత్యామ్నాయాలను కనుక్కోవడంలో విఫలమైంది.
IND vs SA: టీ20లో అత్యంత డేంజరస్ బ్యాటర్..ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా కొనసాగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాను వేధిస్తోంది. 2024 కేలండర్ ఇయర్ లో సూర్యకుమార్ యాదవ్ అంతగా రాణించలేకపోతున్నాడు. కెప్టెన్ గా ఆకట్టుకుంటున్నా.. యువ ఆటగాళ్లతో జట్టును విజయాల దిశగా నడిపిస్తున్నా అతని బ్యాటింగ్ మాత్రం సోసోగా ఉంటోంది. అంతేకాదు సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచినా సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్ గా ఎక్కువ సమయం క్రీజులో గడపలేదు. అతను ఎదుర్కొన్న బంతులు కేవలం 30 మాత్రమే. నాలుగో టీ20లో అసలు బ్యాటింగ్ అవకాశమే రాలేదు. మూడో టీ20లో 1 పరుగుకే ఔటయ్యాడు. ఈ సిరీస్ లో అతను 26 పరుగులు మాత్రమే చేశాడు. తన ఫేవరెట్ బ్యాటింగ్ స్లాట్ 3 వ నంబర్ ను తిలక్ వర్మకు త్యాగం చేయడంతో అతను ఆ స్థానంలో బరిలోకి దిగి వరుసగా రెండు సెంచరీలు సాధించి అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కాగా, అక్షర్ పటేల్ కూడా 29 బంతులు ఫేస్ చేయగా.. రింకూ సింగ్ కూడా 34 బంతులు ఆడాడు. సిరీస్ విక్టరీ కొట్టడంతో టీమిండియా లోని ఈ లోపం కప్పేసినట్లు ఉన్నా.. కీలక సమయంలో ఓడేందుకు ఇదే కారణం అవుతుందేమోనని విశ్లేషకులు చెబుతున్నారు.
IND vs SA: పేస్ బౌలింగ్ లో నెక్ట్స్ ఎవరు..? అంటే సౌతాఫ్రికా సిరీస్ లోనూ టీమిండియా సమాధానం తెలుసుకోలేకపోయింది. ఇప్పటికి బుమ్రా, అర్షదీప్ భారత్ కు టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నా..వీరికి బ్యాకప్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లేదు. సౌతాప్రికా టూర్ లో అవేశ్ ఖాన్ ను తొలి రెండు మ్యాచ్ ల్లో ఆడించినా..అతను విఫలమయ్యాడు. దీంతో చివరి రెండు టీ20 మ్యాచ్ లకు అతన్ని పక్కన బెట్టి ఆల్ రౌండర్ రమణ్ దీప్ ను సీన్ లోకి తెచ్చారు. అతను బ్యాటింగ్ లో ఫరవాలేదనిపించినా…బౌలింగ్ లో ఏమాత్రం పస కనిపించలేదు. పేసర్లు వైషాక్ విజయ్‌కుమార్ తో పాటు యష్ దయాల్ ఇద్దరినీ సిరీస్ అంతా బెంచ్ కే పరిమితం చేశారు. భారత పేస్ రిజర్వ్ లో చాలా పేర్లు కనపిస్తున్నా అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉండి.. సొంత గడ్డపై జట్టును గెలిపించగలిగిన పేసర్లను గుర్తించడంలో టీమిండియా వెనుకబడే ఉంది.
IND vs SA: అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్.. ఎడమచేతి వాటం బ్యాటర్..ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా… సౌతాఫ్రికా టూర్ లో రింకూ సింగ్ అంతగా ఆకట్టుకోలేదు. అసలు తనదైన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడేందుకు గానీ.. మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ చూపేందుకు కానీ అవకాశం దక్కలేదు. అంతే కాదు అతని ఫాం కూడా ఏమంత గొప్పగా లేదు. మూడో టీ20 లో తిలక్ వర్మ ధాటిగా ఆడుతుంటే క్రీజులో చాలా ఇబ్బందిగా కదిలాడు రింకు. ఎంత ప్రతిభ ఉన్నా అతని వీక్ పాయింట్స్ పట్టిన సౌతాఫ్రికా రింకును కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. హార్డ్ లెంగ్త్ ను పిక్ చేయడంలో అతనికి సమస్యలు ఉన్నాయి. సూటిగా వేసే స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో డైలమా.. షార్ట్ పిచ్ డెలివరీలను అంచనా వేయలేకపోవడం వంటి లోపాలు కనిపించాయి. ఫామ్ సమస్య అయితే టీమిండియాకు పెద్దగా నష్టం జరగదు కానీ.. అతనిది సాంకేతిక లోపం కావడంతోనే రింకూ విషయంలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ సమస్యను రింకూ కనుక అధిగమించలేకపోతే జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకమౌతుంది.