Snowfall

Snowfall: మంచు తుఫాన్.. విమానాలు రద్దు, రైళ్ల రాకపోకలకు అంతరాయం

Snowfall: హిమపాతం, వడగళ్ల వాన, వర్షాలతో దేశం మొత్తం స్తంభించిపోయింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో ఈ సంవత్సరం అత్యంత భారీ హిమపాతం నమోదైంది.

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 8 అంగుళాలు, గందర్‌బల్‌లో 7 అంగుళాలు, సోనామార్గ్‌లో 8 అంగుళాల మేర మంచు కురిసింది. కాగా, పహల్గామ్‌లో 18 అంగుళాల మేర మంచు కురిసింది.

శ్రీనగర్-జమ్మూ హైవే కూడా నిలిపివేశారు. దింతో 1200కు పైగా వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం వరుసగా రెండో రోజు ఆదివారం మూసివేయబడింది. రైలు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఇది చదవండి!

Snowfall: మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం రాత్రి మంచు తుఫాను వచ్చింది. 24 గంటల్లో రోహ్తాంగ్ ఉత్తర, దక్షిణ ధ్రువంలో 3 అడుగుల కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. అటల్ టన్నెల్‌పై రాకపోకలు నిలిపివేశారు. 

మరోవైపు రాజస్థాన్-మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. ఢిల్లీలో శనివారం ఉదయం వరకు ఒకేరోజు 41.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 101 ఏళ్లలో డిసెంబర్‌లో ఒక్కరోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *