Lemon Water: నిమ్మకాయలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తాగుతుంటారు. చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తాగుతుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదర సమస్యలకు నిమ్మరసం దివ్యౌషధం. కానీ నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడమే మంచిది.
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. నిమ్మరసం ఎసిడిటీని పెంచే గుణం ఉన్నందువల్ల ఎసిడిటీ రోగులకు మంచిది కాదు.
ఇది కూడా చదవండి: Banana: ఈ ఒక్క పండు ఎన్నిరోజులైనా పాడవదు.. అదేంటో తెలుసా..?
Lemon Water: దంత సమస్యలు ఉన్నవారికి లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి హానికరం. నిమ్మకాయలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దంతాల మీద ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మాత్రమే కాకుండా చాలా ఆక్సలేట్ కూడా ఉంటుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అది స్ఫటికాల రూపంలో శరీరంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.