Indian Army: మన దేశ శౌర్యానికి ప్రతీకగా నిలిచే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. మహ్మదీయ రాజులను ఎదిరించిన హిందూ రాజుగా ఆయనను చైతన్య దీప్తిగా భావిస్తారు. ఇప్పటికీ ఊరూరా ఆయన విగ్రహాలతో హిందూ, ఇతర యువజన సంఘాలు విగ్రహాలను ఏర్పాటు చేశాయి. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని తాజాగా చైనా సరిహద్దుల్లోని మనదేశంలో ఆవిష్కరించారు.
Indian Army: పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని నెలకొల్పింది. శౌర్య పరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహరాజ్ చిహ్నమని సైన్యాధికారులు అభివర్ణించారు. 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు సైన్యంలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ వెల్లడించింది. నిత్యం ఆయన విగ్రహంతో సైనికుల్లో చైతన్యం నిండుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు భావిస్తున్నారు.