Crime News: ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలో ఓ కొడుకు తన కన్న తల్లిని హత్య చేసిన దారుణ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాలకు బానిసైన 40 ఏళ్ల వ్యక్తి తన 65 ఏళ్ల తల్లిని డబ్బు ఇవ్వలేదని కత్తితో పొడిచాడు.
సోనూ అనే వ్యక్తి తన వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. అతడు డ్రగ్స్‌కు బానిసై నిత్యం డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి డబ్బు విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. డబ్బు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో కోపంతో ఉన్న సోనూ తన తల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
Also Read: Goa: ఆటో డ్రైవర్ దాడి.. మాజీ ఎమ్మెల్యే మృతి
రాత్రి 9 గంటల సమయంలో దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు కాల్ రావడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో వృద్ధ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలు నిందితుడి తల్లిగా గుర్తించారు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, తాను డ్రగ్స్‌కు బానిసై డబ్బు కోసం తల్లిని వేధించేవాడినని, డబ్బు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జీటిబీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు