Shoaib Akhtar

Shoaib Akhtar: నాకైతే మాటలు రావడం లేదు

Shoaib Akhtar: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకపోవడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇది చూసి తాను హృదయం ముక్కలైందని, ఏం మాట్లాడాలో తెలియట్లేదని అన్నారు. నాకు మాటలు రావడంలేదు. ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు. తీవ్రంగా బాధించింది. ఏం చెప్పాలో కూడా తెలియడంలేదు. విజయం సాధించిన టీమ్‌ఇండియాకు హ్యాట్సాఫ్‌ అని అక్తర్ ఒక పాకిస్థానీ టీవీ షోలో అన్నారు. ఇలాంటివాటిని రాజకీయం చేయొద్దు. క్రికెట్‌ను దాంతో ముడిపెట్టొద్దు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతుంటాయి. వాటిని మరిచిపోయి ముందుకు సాగాలి.

ఇది క్రికెట్. కరచాలనం చేసుకుంటే బాగుండేది అని అన్నారు.భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు హాజరు కాలేదు. అక్తర్ దీనిని సమర్థిస్తూ, “సల్మాన్ అలా చేయడమే సరైన నిర్ణయం” అని అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల పెరిగిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉన్నారని, ఇది తమ దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ.. తుది ఎంపిక జాబితా విడుదల

కాగా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పాక్ కోచ్ మైక్ హెసన్ అన్నారు. వారి కోసం గ్రౌండ్‌లో తాము చాలాసేపు ఎదురుచూశామని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచులో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కాగా నిన్న భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *