Shilpa Shetty: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలన్న నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతుల పిటిషన్ ను 60 కోట్లు పూచీకత్తు సమర్పిస్తే పరిశీలిస్తామని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. బెస్ట్ డీల్ సంస్థలో 60 కోట్లు పెట్టుబడి పెట్టాలని శిల్పాశెట్టి దంపతులు తనను ప్రోత్సహించారని, తర్వాత ఆ మొత్తాన్ని వారు వ్యక్తిగత ప్రయోజనాలకు ఖర్చు చేశారంటూ దీపక్ కొటారీ అనే వ్యాపారవేత్త ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదుచేశారు. భారీ ఆర్థిక మోసం కేసు కావడంతో పోలీసులు శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దేశం దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను రద్దు చేయాలంటూ ఆ జంట.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. వృత్తిపరమైన అవసరాలు ఉండటం వల్ల తమకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.
ఐతే చీటింగ్ కేసులో నిందితులుగా ఉండటంతో లుకౌట్ నోటీసులను రద్దు చేయలేమని, కావాలంటే 60 కోట్లు డిపాజిట్ చేస్తే ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని శిల్పా దంపతులు వాదించగా.. అందుకే ఇప్పటివరకు అరెస్టు కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది..
ఇది కూడా చదవండి: Naveen Yadav: సెంటిమెంట్ కాదు.. అభివృద్ధే మా ధ్యేయం
ఒక వ్యాపారవేత్త అయిన దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శిల్పా శెట్టి దంపతులు తమ సంస్థ ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ లో పెట్టుబడి పెట్టమని కోరి, సుమారు రూ. 60 కోట్లు తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ నేపథ్యంలో, ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ దంపతులు దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది. తమపై ఉన్న LOCని నిలిపివేసి, వృత్తిపరమైన అవసరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.