Railway Track Incident: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద అందరినీ ఆశ్చర్యపరిచే ఘటన జరిగింది. ఓ మహిళ కారు నడుపుకుంటూ నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లింది. ఇది చూసిన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైళ్లను ఆపేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ సంఘటన వల్ల బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ వంటి కీలక రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న కారును తొలగించేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఉగ్రవాదంపై చర్యలు తప్పవు.. చైనా తో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్
ప్రస్తుతానికి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆమె ఎలాంటి ఉద్దేశంతో ట్రాక్‌పైకి వెళ్లిందో ఇంకా స్పష్టతలేదు. ఇది యాక్సిడెంట్‌గా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రాథమికంగా ఆమె తప్పుగా గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన రైల్వే భద్రతపై అనేక ప్రశ్నలు లేపింది. ట్రాక్‌ల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరమని ప్రయాణికులు కోరుతున్నారు.
రైల్వే శాఖ యాత్రికుల సౌకర్యం కోసం బస్సులు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ల రాకపోకలు త్వరలోనే పునరుద్ధరించే అవకాశం ఉంది.

