Sexual Assault: పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్న ఓ డాక్టర్ విచక్షణను మరిచాడు. తన వద్దకు వచ్చే రోగులకు చికిత్సలు చేసి జబ్బును నయం చేయాల్సింది పోయి వారిపైనే పశుత్వంతో అకృత్యాలకు పాల్పడ్డాడు. అలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 299 మందిపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఇలా మూడు దశాబ్దాల పాటు తన సర్వీసు కాలంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం మరింత శోచనీయం.
Sexual Assault: ప్రాన్స్ దేశంలో జరిగిన ఈ అత్యంత అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడి బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏండ్ల జోయెల్ లీ స్కౌర్నెక్ అనే డాక్టర్ గతంలో ఓ ఆసుప్రతిలో శస్త్రచికిత్స నిపుణిడిగా పనిచేసేవాడు. 1989 నుంచి 2014 వరకు అతడి వద్దకు వచ్చే రోగులపై లైంగికంగా దాడి చేసేవాడు. వారిని మత్తులో ముంచి ఈ ఘాతుకానికి పాల్పడేవాడట.
Sexual Assault: డాక్టర్ జోయెల్ నిజస్వరూపం మాత్రం 2017వ సంవత్సరంలో బయటపడింది. తన పొరుగింట్లో ఉండే ఆరు సంవత్సరాల చిన్నారిపై అతను అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు జోయెల్ ఇంటిని తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి.
Sexual Assault: తన ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫొటోలు, 650కి పైగా అశ్లీల వీడియోలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలను నెరుపుతున్నట్టు అతడు తన డైరీలో రాసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో దిగ్భ్రాంతికర విషయం కూడా వెల్లడైంది. ఎవరెవరిపై ఎలా లైంగికదాడి జరిపాడోనన్న విషయాలను ఎప్పటికప్పుడూ నోట్ చేసుకోవడాన్ని పోలీసులు గుర్తించారు.
Sexual Assault: నాలుగు నెలలుగా ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 వరకు 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతను లైంగికదాడికి పాల్పడినట్టు కోర్టులో తెలిపాడు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని తేలింది. నేను చాలా ఘోరమైన పనులు చేశాను. నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా.. అని డాక్టర్ జోయెల్ కోర్టకు తెలిపాడు. జోయెల్ వికృత చేష్టలపై జరిగే విచారణలో దోషిగా తేలితే అతను చనిపోయే వరకూ కఠిన కారాగార శిక్షను విధించే అవకాశం ఉన్నది.