IPS Transfers: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు కొత్త పదవులు కట్టబెట్టారు. బదిలీలు ముఖ్యమైన శాఖలతోపాటు కీలక భద్రతా వ్యవస్థలను ప్రభావితం చేయనున్నాయి.
ముఖ్యమైన నియామకాలు ఇలా ఉన్నాయి:
శిఖా గోయల్ – ఇప్పటివరకు ఇతర పదవుల్లో సేవలందిస్తున్న ఈ అధికారిణిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అలాగే ఎఫ్‌ఎస్ఎల్‌ఎల్ డైరెక్టర్ హోదాలో నియమించారు.
చారు సిన్హా – ఆమెకు మహిళా భద్రతా విభాగంతోపాటు సీఐడీ అదనపు డీజీ బాధ్యతలు అప్పగించారు.
అభిలాష్ బిస్త్ – ఇప్పటివరకు వెయిటింగ్‌లో ఉన్న ఈ సీనియర్ అధికారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు.
ఎస్. చైతన్య కుమార్ – ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఎస్‌బీ డీసీపీగా ఉన్న ఆయనను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించారు.
పాటిల్ కాంతిలాల్ సుభాష్ – ప్రస్తుతం సౌత్‌ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న ఈయనను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
తఫ్సీర్ ఇక్బాల్ – మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆయనను ఇప్పుడు చార్మినార్ రేంజ్ డీఐజీగా నియమించారు.
డీవీ శ్రీనివాసరావు – ఆయనను మెదక్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
ఈ బదిలీలతో పాటు మరికొంతమంది అధికారుల బదిలీలకు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా వ్యవస్థను సమర్థవంతంగా నడిపించేందుకు, పరిపాలనను మరింత శక్తివంతం చేయడానికే ఈ బదిలీలు చేపట్టినట్టు ఉన్నతాధికారుల వర్గాలు వెల్లడించాయి.