Honeymoon Murder

Honeymoon Murder: సినిమాగా రానున్న సంచలన హత్య కేసు!

Honeymoon Murder: గత మేలో మేఘాలయలో జరిగిన ఓ హనీమూన్‌ యాత్ర దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నవదంపతులైన రాజా రఘువంశీ, సోనమ్‌ హనీమూన్‌ కోసం షిల్లాంగ్‌ వెళ్లారు. కానీ, ఆ యాత్ర రఘువంశీ హత్యతో ముగిసింది. అతడి భార్య సోనమ్‌, ఆమె ప్రియుడు రాజ్‌ కుష్వాహ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్య దేశావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. ఈ హత్య ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది.

Also Read: Rajinikanth: పోస్టరే కాపీ అంటే మరి సినిమా.?

మేఘాలయ హనీమూన్‌ హత్య కేసు సినిమాగా మారనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వెండితెరపై కనిపించనుంది. ‘హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో బాలీవుడ్‌ దర్శకుడు ఎస్‌పీ నింబావత్‌ ఈ సినిమాని తీస్తున్నారు. రాజా రఘువంశీ కుటుంబ అనుమతులతో స్క్రిప్ట్‌ పూర్తి చేశారు. ఈ కేసు వెనుక దాగిన షాకింగ్‌ నిజాలు ఏంటి? సినిమా ఏం చెప్పనుంది? అనే అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *