Kubera: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూ.130 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం, ఇది ఆయన కెరీర్‌లో రికార్డు! అక్కినేని నాగార్జున రూ.14 కోట్లు, రష్మిక మందన్న రూ.4 కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూ.3 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో జూన్ 20న విడుదల కానుంది.
Also Read: TheRajaSaab: ‘ది రాజా సాబ్’ రిలీజ్‌పై సంచలన అప్డేట్..!
Kubera: ఇప్పటికే విడుదలైన ‘కుబేర’ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషన్స్, యాక్షన్, డ్రామాతో ఈ సినిమా రూపొందుతుండగా, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కుబేర’ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!
పోయిరా మామా (తెలుగు) లిరికల్ కుబేర :