Kerala: కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లా, చుల్లిమడై ప్రాంతానికి చెందిన పౌల్‌రాజ్ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఒకరిని కొట్టిన కేసులో వలైయార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తరువాత అతనిని బెయిల్ పై విడుదల చేశారు. తనను అరెస్ట్ చేశారనే కోపంతో పౌల్‌రాజ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న వ్యాన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో వ్యాన్‌లో మంటలు చెలరేగాయి.
ఇది కూడా చదవండి: Ap news: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి అరెస్టు.
Kerala: వాహనంలో మంటలు చెలరేగడం.. భారీగా పొగ వ్యాపించడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న పాల్‌రాజ్‌ను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వ్యాన్‌లోని మంటలను ఆర్పివేయడంతో మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా ఆపగలిగారు. సీజ్ చేసిన వాహనాన్ని తగులబెట్టడం, పోలీసు అధికారుల పనికి ఆటంకం కలిగించడం ఆరోపణలతో పౌల్‌రాజ్ పై నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజీవ్ తెలిపారు.