Rashmika Mandanna

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ వేడుకలో రష్మిక తన తోటి నటి కృతి సనన్‌ను పొగిడే క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఒక బూతు పదం వాడేసింది. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

స్టేజ్ పైన రష్మిక చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ పక్కనే ఉన్న కృతి సనన్‌ వైపు తిరిగి ప్రశంసల జల్లు కురిపించింది. ‘కాక్‌టెయిల్ 2 సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంది. కృతి.. నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. ఆ విషయం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు.. అండ్ యు ఆర్ ఫకింగ్ హాట్!’ అని ఫ్లోలో అనేసింది. అయితే తాను ఎంత పెద్ద మాట అన్నానో రష్మికకు మరుక్షణమే అర్థమైంది. వెంటనే తప్పు తెలుసుకుని షాక్‌తో తన చేతులతో నోరు మూసుకుంది. ఆ తప్పును కవర్ చేయడానికి నవ్వుతూ.. ‘ఓహ్ సారీ! దాన్ని సెన్సార్ చేసేయండి’ అని సరదాగా అంది. రష్మిక ఇచ్చిన రియాక్షన్‌కు అక్కడ ఉన్న ఆడియన్స్, మీడియా వాళ్లు గట్టిగా నవ్వుతూ కేకలు వేశారు. ఆ తర్వాత రష్మిక తేరుకుని.. ‘ఆమె చాలా అమేజింగ్.. లుక్ ఎట్ హర్. మా మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది’ అంటూ కృతిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

స్టేజ్ పైన ఉన్నవాళ్లు ఈ విషయాన్ని నవ్వుతూ లైట్ తీసుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రష్మిక వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎంతో పద్ధతిగా, చూసి చూడనట్లు మాట్లాడే రష్మిక.. ఈసారి ముంబై కల్చర్‌కు అలవాటు పడి కాస్త హద్దులు దాటి ప్రవర్తించిందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఫ్లోలో నోరు జారినప్పటికీ.. ఇలాంటి పెద్ద పబ్లిక్ ఈవెంట్లలో ఇటువంటి పదాలు వాడటం రష్మిక మంచి ఇమేజ్‌కు కాస్త మైనస్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *