Ap news: వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.అర్ధరాత్రి వరకు కొనసాగిన ఏసీబీ అధికారుల సోదాల్లో పీఏ మురళి పేరిట 20 ఎకరాలకు పైగా భూమి విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు పలుకీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధర్మాన కృష్ణదాస్ వద్ద అధికారిక పీఏగా మురళీ పని చేశారు. ఈయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మురళి సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంత గ్రామంతో పాటు బుడితి, లింగనాయుడిపేట, విశాఖపట్నంలోని మురళి నివాసాల్లో ముమ్మరంగా తనికీలు చేపట్టారు.