SFI: రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పిలుపునిచ్చింది. రాష్ట్రంలో పలుచోట్ల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలకు నిరసనగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆ సంఘం రాష్ట్ర నేతలు ఆరోపించారు.
SFI: పాఠశాలలు, గురుకులాల్లో వివిధ సమస్యలతో విద్యార్థులు చనిపోతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో సతమతం అవుతున్నాయని, రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని ఆరోపించారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. విద్యాశాఖ, గురుకులాలు, కేజీబీవీలపై సమీక్షించాలని, సమస్యలను పరిష్కరించాలని, సత్వరమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.