Air pollution: రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. మారుతున్న కాలంతో ఇండస్ట్రీలైజేషన్ మెరుగుదలతో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది.వందల ఎకరాల్లో అడవులు దహనం అవుతుండటంతో పాటు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది.దీని కారణంగా ఏటా 15 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ది లాన్సెట్ జర్నల్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి.2000- 2019 మధ్య ఈ కార్చిచ్చు వల్ల ఏర్పిడిన గాలి కాలుష్యంతో ఏటా 4.5 లక్షల మంది గుండె జబ్బులతో, శ్వాస సంబంధిత సమస్యలతో మరో 2.2 లక్షల మంది చనిపోయినట్లు తెలిపింది.
అయితే, గాలికాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 90శాతం పేద, మధ్యతరహా ఆదాయం ఉండే దేశాల్లోనే జరగుతున్నాయని లాన్సెట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఒక్క ఆఫ్రికాలోనే 40 శాతం మరణాలు నమోదయ్యానయి పేర్కొంది. చైనా, కాంగో, భారత్, ఇండోనేషియా, నైజీరియాలలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాలుగా గుర్తించింది.రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.