అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..

వైద్యం చేస్తే విరపుయాలి కానీ వికటించొద్దు..వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్ర ఇబ్బంది పడింది. మహిళ పొత్తి కడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత బయటపటం స్థానికంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 ఏళ్ల క్రితం గ్యాంగ్‌టక్‌లోని ఓ ఆసుపత్రిలో అపెండిక్స్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలా మంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పి తగ్గలేదు. నొప్పికి కారణం కూడా చెప్ప లేకపోయారు. అయితే ఈ నెల 8న ఆమె తనకు గతంలో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయగా కళ్ళు తిరిగి దృశ్యాలు బయట పడ్డాయి.

ఆమె పొత్తి కడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆ రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించా

రు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *