SBI Job Notifications

SBI Job Notifications: బ్యాంకింగ్ రంగంలో బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎస్బీఐలో భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్‌

SBI Job Notifications: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 13,735 క్ల‌ర్క్ (జూనియ‌ర్ అసోసియేట్‌) పోస్టుల భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కస్ట‌మ‌ర్ స‌పోర్ట్‌ సేల్స్ విభాగంలో ఈ పోస్టుల‌ను సంస్థ భ‌ర్తీ చేయ‌నున్న‌ది. ఈ నోటిఫికేష‌న్‌లో హైద‌రాబాద్ స‌ర్కిల్‌లో 342 ఖాళీలు ఉన్నాయి. దీంతో బ్యాంకింగ్ రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే నిరుద్యోగ యువ‌త ఈ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఎస్బీఐ జూనియ‌ర్ అసోసియేట్ ఉద్యోగ నోటిఫికేష‌న్‌లో 2025 జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హిస్తారు. ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థుల‌కు మెయిన్స్ ప‌రీక్ష‌లను మార్చి లేదా ఏప్రిల్ నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ది.

ఇది కూడా చదవండి: Parliament: ఎంపీల మధ్య తోపులాట.. ఇద్దరు సభ్యులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం..

ఈ ఎస్బీఐ బ్యాంక్ జాబ్ కోసం ఈ నెల 17న నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కేవ‌లం డిగ్రీ అర్హ‌త‌తో ఈ ఉద్యోగాల‌కు పోటీ ప‌డ‌వ‌చ్చు. ఫైన‌లియ‌ర్ ప‌రీక్ష‌లు రాస్తున్న‌వారు కూడా అర్హులు. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల వ‌య‌సు 20 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. 1996కు ముందు పుట్టిన వారు అన‌ర్హులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *