Samantha: అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాల పెళ్ళి డిసెంబర్ 4వ తేదీ రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైతు మాజీ భార్య సమంత దీనిపై ఎలా స్పందిస్తుందా? అని చాలామంది ఎదురుచూశారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లపై దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఇన్ స్టా స్టోరీలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ‘ఫైట్ లైక్ ఏ గర్ల్ ‘ అనే ట్యాగ్ లైన్ తో సమంతా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఓ పిల్లాడిని ఒక్క పట్టుతో ఓ బాలిక కింద పడేస్తుంది. బాలిక పట్టుదల ముందు బాలుడు తలవంచాల్సిందే! అర్థంలో ఈ వీడియోను చూడొచ్చు. చైతు, శోభిత పెళ్ళిరోజే సమంత దీనిని పోస్ట్ చేయడం వెనుక మర్మం ఏమిటని ఎవరికి తోచిన విధంగా వారు భాష్యలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే…. చైతు.. శోభిత మెడలో మూడు ముళ్లు వేస్తున్న సమయంలో సంతోషాన్ని ఆపుకోలేక అఖిల్ విజిల్స్ వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైతు వివాహానికి కొద్ది రోజుల ముందే అఖిల్ వివాహ నిశ్చితార్థం జరిగింది. అతని పెళ్ళి వచ్చే యేడాది ఉండబోతోంది.
